హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా మూర్తి మదర్ థెరిస్సా

VZM: సేవా మూర్తి మదర్ థెరిస్సా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. దేశం గాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అనేకమంది అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి ఆమె అని అన్నారు.