హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిలాదున్ నబీ సందర్భంగా శాంతి ర్యాలీ

KDP: ప్రొద్దుటూరులో మిలాదున్ నబీ సందర్భంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో విశ్వశాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మైదుకూరు రోడ్డులోని నజీరుల్లా ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అసార్ షరీఫ్ వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవంతో జీవించాలనే సందేశాన్ని నిర్వాహకులు చాటిచెప్పారు.