హైదరాబాద్: 28°C
తెలంగాణ

AI మార్ఫింగ్‌తో ఆర్మీ మేజర్ భార్యకు వేధింపులు

HYD: ఆర్మీ మేజర్ భార్య ఫొటోలు, వీడియోలను AIతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వేధిస్తున్న ఘటన నగరంలో కలకలం రేపింది. బాధితురాలి స్నేహితులు, బంధువులకు వీటిని పంపుతూ దుండగులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. OSINT ద్వారా సేకరించిన సోషల్ మీడియా ఖాతాల వివరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.