హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండేళ్ల అభివృద్ధి–సంక్షేమంపై ఎమ్మెల్యే ప్రచారం

PPM: 'రెండేళ్ల అభివృద్ధి-సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా సీతానగరం మండలం ఏగోటివలస, అనంతరాయుడుపేట గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పర్యటించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.