హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ఏపీ ట్రాన్స్‌కో పరీక్ష

కృష్ణా: పెడన మండలం నందమూరులోని ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఏపీ ట్రాన్స్‌కో ఆన్‌లైన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు మొత్తం 90 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 75 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 15 మంది గైర్హాజరైనట్లు పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.ఆర్.ఎస్. రెడ్డి తెలిపారు.