హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు తీవ్ర పోటీ

ATP: అనంతపురం జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వలంటీర్) పోస్టులకు భారీ పోటీ నెలకొంది. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల కోసం ప్రభుత్వం జిల్లాకు 401 పోస్టులను మంజూరు చేయగా, వాటిలో ఎస్జీటీ కేడర్ 179, స్కూల్ అసిస్టెంట్ కేడర్ 222 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా, మొత్తం 1,786 దరఖాస్తులు అందాయి.