హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోనియా గాంధీ నగర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

RR: ఉప్పల్ నియోజకవర్గం సోనియా గాంధీ నగర్ ఫేజ్-2లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కాలనీ ప్రజల భద్రతకు ఇవి ఎంతో ఉపయోగకరమన్నారు. నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.