హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌లో పర్యాటకుల అవస్థలు

BPT: సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు పార్కింగ్ దారి బురదమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాలమైన మెయిన్ రోడ్డు ఖాళీగా ఉన్నా వాహనాలను అనుమతించడం లేదని, దారులకు ముళ్ల కంచెలు వేయడం వల్ల నడిచి వెళ్లేవారికీ కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.