హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యే హామీ

ELR: నగరంలోని కుమ్మరి రేవు (భగత్‌సింగ్ నగర్)లో నివసిస్తున్న 800 కుటుంబాలకు రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి)కి బుధవారం వినతిపత్రం అందజేశారు. రెండు దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మూడు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.