హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా మంచినీటి మోటార్ బాక్స్

ELR: నాచుగుంట శివారు కొత్తగూడెంలోని వైఎస్ జగన్ కాలనీ వద్ద పంచాయతీ మంచినీటి మోటారుకు సంబంధించిన స్టార్టర్ బాక్స్ నేలపై పడి ప్రమాదకరంగా మారింది. విద్యుత్ స్తంభానికి అమర్చాల్సిన బాక్స్ ఊడిపోయి కింద చెక్కపై ఉంది. వైర్లు బయటకు వచ్చి, బాక్స్ తెరిచి ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.