W.G: పాలకోడేరు గ్రామానికి చెందిన అంగర సుబ్బారావు హృద్రోగంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం స్థానికులు సమస్యను రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీ ప్రత్యేక చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.1.50 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం మంజూరు చెక్కును సుబ్బారావుకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
హృద్రోగ బాధితుడికి ఎంపీ చొరవతో సాయం


