హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ

NRPT: కొత్తపల్లి మండలం భూనీడులో ముస్లింలు బుధవారం మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ సంఖ్యలో ప్రజలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సోదరభావంతో మెలగాలని వారు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.