PDPL: 8వ కాలనీ RG-2 OCP-3లోని కృషి భవన్‌లో బుధవారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి కార్మికులు, అధికారులకు రాఖీలు కట్టి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు


