హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకల్లో ఎస్సై విమల

VKB: బంట్వారం మండలం తొర్మామిడి గ్రామంలో మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సై విమల హాజరై ముస్లిం సోదరులకు మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు తెలిపారు. పర్వదినం సందర్భంగా గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.