MBNR: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. దేవాలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


