హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్‌గా మురళి

KNR: తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం చొప్పదండి(M) కన్వీనర్‌గా కోనేరుపల్లి గ్రామానికి చెందిన గజ్జల మురళిని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం సూచన మేరకు ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాల వ్యాప్తికి కృషి చేస్తున్న మురళికి పలువురు అభినందనలు తెలిపారు.