హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై MPDO సమీక్ష

JGL: రాయికల్(M) రామాజీపేట్ గ్రామ పంచాయతీని MPDO బింగి చిరంజీవి బుధవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి, 16వ ఆర్థిక సంఘం నిధుల ప్రణాళికలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇంటి నంబర్లకు మొబైల్ అనుసంధానం, పారిశుద్ధ్యం, క్లోరినేషన్, జలసిరి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాఠశాల అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు.