హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా మారిన తిరుపల్లి రహదారి..!

ADB: జిల్లాలోని తిరుపల్లి వద్ద రహదారి అధ్వానంగా మారింది. వర్షాల కారణంగా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదంగా మారిందని.. ఇటీవల ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలన్నారు