హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

BHPL: కాటారం మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 28న రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామివారి చంద్ర వాహన సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.