హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన గ్రామాల్లో విష జ్వరాల విజృంభణ

MNCL: జన్నారం మండలంలోని లోతరే, అనుబంధ గ్రామాలలో గిరిజనులు విష జ్వరాలతో బాధపడుతున్నారని ఆ గ్రామ సర్పంచ్ బోడ శంకర్, ఉప సర్పంచ్ నానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ.. లోతరే గ్రామానికి చెందిన హెచ్.కే.సోము మలేరియా పాజిటివ్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్రామంలో సరైన వైద్య సౌకర్యాలు లేవని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు.