హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాలువ నిర్మాణంపై మండిపడిన కౌన్సిలర్

JN: జనగామ పట్టణంలోని 18వ వార్డులో సీడీఎంఏ నిధులతో జరుగుతున్న మురుగు కాలువ పనులపై కౌన్సిలర్ సుగుణాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థాయి కంటే రెండు అడుగుల ఎత్తులో కాలువ నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీంతో మురుగునీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు.