హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐ అడ్మిషన్ల గడువు పెంపు

SRD: సంగారెడ్డి ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు మరో అవకాశం లభించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు కన్వీనర్ తిరుపతిరెడ్డి తెలిపారు. పదో తరగతి పాసైన వారు iti.telangana.cgg.gov.inలో దరఖాస్తు చేసి, సమీప ఐటీఐలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని కోరారు.