SDPT: చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. మొత్తం 12 అంశాల్లో 10 అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పట్టణంలో నీటి సరఫరా, లోతట్టు ప్రాంతాల్లో మొరం , కబేళా నిర్మాణం, బండ్ల బోనాల ఏర్పాట్లపై తీర్మానించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్


