హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయ ఖైదీల విడుదలకు మహా ధర్నా..!

HNK: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నిర్వహించే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.