హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

ASF: జిల్లా కేంద్రంలోని జామా మసీదు నుంచి మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని జులూస్ ప్రారంభమైంది. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మహమ్మద్ ప్రవక్తను స్మరిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. జులూస్ ప్రధాన వీధుల గుండా కొనసాగడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.