హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 27న క్రీడా కార్యక్రమాలు

JN: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మినీ స్టేడియంలో ఈ నెల 27న వివిధ క్రీడా కార్యక్రమాలు జరగనున్నాయి. 16 ఏళ్లలోపు, అంతకుమించిన వయసు విభాగాల్లో యువతీ యువకులకు పరుగుపందెం, దూరజంప్, గోళీ విసురు, షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించనున్నారు. పాల్గొనదలచిన వారు ఉ. 7 గంటలకు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు.