హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో మహిళ మృతి

MBNR: నవాబుపేట (చౌడాపూర్) మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములమ్మ (55) పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.