హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెన్షన్లకు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి'

KMR: పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఈనెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని బుధవారం భిక్కనూర్ ఎంపీడీవో సవితారెడ్డి చెప్పారు. ఏడు రకాల పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలతో గ్రామ సచివాలయ కార్యదర్శులకు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని ఆమె సూచించారు.