హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిగడ్డ వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

BHPL: భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిసరాల్లో గోదావరి వరద ఉద్ధృతి కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి జలాశయ స్థాయి 91.10 మీటర్లకు చేరుకున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 1.51 లక్షలకుపైగా క్యూసెక్కుల నీరు చేరుతుండగా, వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు పంపిస్తున్నారు. 85 గేట్ల ద్వారా ప్రవాహం కొనసాగుతోంది.