హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మొక్కలను నాటి పర్యావరణ కలుషితాన్ని తగ్గించాలి'

ADB: మొక్కలను నాటి పర్యావరణ కలుషితాన్ని తగ్గించాలని తాంసి మండల తహసిల్దార్ జాదవ్ గణేష్ అన్నారు. బుధవారం మండలంలోని పొన్నారి గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు. సర్పంచ్ భూమన్న, మాజీ వైస్ ఎంపీపీ రఘు, రామ్ రెడ్డి, లక్ష్మిపతి, తదితరులు పాల్గొన్నారు.