హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు అన్ని పోలింగ్ స్టేషన్లలో గ్రామ సభలు

NGKL: ఊర్కొండ మండలంలో రేపు అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ యూసుఫ్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త పేర్ల నమోదు, తొలగింపులపై ఈ సభల్లో చర్చిస్తామని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.