హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల దాడిలో రెండు మేకలు మృతి

HNK: నడికూడ మండలం కంఠాత్మకూర్‌లో వీధి కుక్కలు దాడి చేయడంతో తోట్ల మల్లయ్యకు చెందిన రెండు మేకలు మృతి చెందాయి. మేతకు వెళ్లిన మేకలపై కుక్కలు గుంపుగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో రైతుకు సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లింది. గతంలోనూ కుక్కల దాడిలో ఐదు గొర్రెలు మృతి చెందినట్లు పేర్కొన్నారు.