MHBD: కురవి మండలం నేరడలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ భూమి వివాదంతో మనస్తాపానికి గురైన రైతు రామచంద్రయ్య చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు బుధవారం స్థానికులు తెలిపారు. మరో రైతు పొలం వద్ద రోడ్డుకు అడ్డంగా కంచె నాటడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పొలం వద్దే రామచంద్రయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
పొలం వివాదం.. రైతు మృతి


