GDWL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం 10,632 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, నీటి నిల్వ 95.01 టీఎంసీలకు చేరింది. మొత్తం సామర్థ్యం 105.788 టీఎంసీలు. కాలువల ద్వారా 7,968 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
తుంగభద్రకు కొనసాగుతున్న వరద ప్రవాహం


