మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వీరేశం తెలిపారు. అమ్మవారిని పల్లకీలో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించనున్నారు. పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
రేపు ఏడుపాయల క్షేత్రంలో పల్లకి సేవ


