హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి కోసం 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్': కలెక్టర్

NRPT: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారి ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు కుట్టు మిషన్ అందించి, ఇంటి వద్దనే ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అర్హులైన వారు సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.