హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిగడ్డ బ్యారేజ్ నీటిమట్టం వివరాలు

BHPL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు బ్యారేజీ నీటిమట్టం 91.10 మీటర్లుగా నమోదైంది. బ్యారేజీకి 1,51,890 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 85 గేట్లను తెరిచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద గోదావరి నది ఫ్రీ ఫ్లో కండిషన్‌ లోవుంది.