GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో వర్షాలు కురవాలని కోరుతూ బుధవారం సత్యమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళ హారతులు పట్టి భజన చేస్తూ తుంగభద్ర నదికి చేరుకుని జలాలు తెచ్చారు. గ్రామ వీధుల్లో అమ్మవారిని ఊరేగించి నది నీటితో అభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.
తెలంగాణ
వర్షాలు కురవాలని సత్యమాంబకు విశేష పూజలు


