హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు శుభవార్త.. ఫ్రీగా పంపిణీ

HYD: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. SEP 14న జరిగే పండుగకు ముందే లక్ష మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. వీటిలో 70 వేల 8అంగుళాలు, 20వేల 1 అడుగు, 10వేల 1.5అడుగుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటినీ జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా భక్తులకు అందజేయనున్నారు.