ADB: అహర్నిశలు శ్రమించి సాగు చేసిన సోయా, పత్తి, తొగరి పంటలను అడవి పందులు ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని జైనథ్‌కు చెందిన రైతు దానిపెళ్లి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పడ్డ కష్టం వృథా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి, అడవి పందుల బెడద నుంచి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. నష్టపోయిన రైతన్నను తక్షణమే ఆదుకుని పరిహారం అందించాలని కోరారు.
తెలంగాణ
'అడవి పందుల బెడద నుంచి రక్షణ కల్పించాలి'


