హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో ఇల్లు కూలి మహిళ మృతి

SRCL: కోనరావుపేట మండలంలోని మామిడిపల్లిలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలి గుమ్మడి లక్ష్మి(40) నిద్రలోనే మృతి చెందారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.