హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి ప్రత్యేక పూజలు

WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి ఆలయంలో శ్రావణమాసం వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు రెండో బుధవారం సందర్భంగా తల్లికి అర్చకులు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.