హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాల్వలో కాలం చెల్లిన మందులు

NRPT: మరికల్ మండలం కన్మనూర్ శివారులోని కాల్వలో కాలం చెల్లిన ఔషధాలు కుప్పలు కుప్పలుగా పడివుండటం కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల మందులను గుంతలో పూడ్చాలి లేదా కాల్చి నిర్వీర్యం చేయాలి. ప్రైవేటు మందులైతే కంపెనీలకు తిరిగి పంపాలి. నిబంధనలకు విరుద్ధంగా మందులు పడేయడంపై వైద్య శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.