హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: కలెక్టర్, ఎస్పీ

SRPT: మోతె (M) బిక్యా తండాలో దారుణ హత్యకు గురైన దంపతులు నాగులు, బుబా కుటుంబానికి జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా SP నరసింహ భరోసా కల్పించారు. ఈ మేరకు బాధితుల నివాసానికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి, సంధ్యలను పరామర్శించారు. అట్రాసిటీ కేసు కింద రావాల్సిన పరిహారంలో మొదటి విడతగా 50 శాతం రూ. 4.20 లక్షలను కుటుంబ సభ్యులకు అందజేశారు.