హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పూలాజీ బాబా జయంతి వేడుకలు

ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో సద్గురు పూలాజీ బాబా జయంతి వేడుకల ఆహ్వాన కమిటీ ప్రతి నిధులతో కలిసి జయంతి వేడుకల గోడప్రతులను కలెక్టర్ హరిత ఆవిష్కరించారు. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈనెల 30న జైనూర్(M) పట్నాపూర్లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.