హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.