ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేయూత పింఛన్ల అర్హతకు సంబంధించి అభ్యంతరాలు, దరఖాస్తులను ఈనెల 31లోపు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ అంజయ్య తెలిపారు. అర్హత ఉన్న వారు నిబంధనల ప్రకారం దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆగస్టు 31 తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
చేయూత పింఛన్లకు ఆగస్టు 31 వరకు దరఖాస్తులు


