హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి

KMM: వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించి మోడల్‌ కాలనీగా అభివృద్ధి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం భూదాన్‌ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ దివాకర కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేదలకు గౌరవప్రదమైన జీవన వాతావరణం కల్పించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.