BHNG: వలిగొండ మండలం మీదుగా వెళ్లే చిట్యాల–భువనగిరి ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ద్విచక్రవాహనదారులు, ఆటోలు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ–యాదాద్రి భువనగిరి జిల్లాలను కలిపే కీలక మార్గం కావడంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా ప్రధాన రహదారి


