హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: జేఏసీ

SRD: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న చేపట్టే కలెక్టరేట్ ధర్నాను సక్సెస్ చేయాలని జేఏసీ జిల్లా ఛైర్మన్ జావీద్ అలీ కోరారు. ప్రభుత్వం మెరుగైన పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వైద్యనాథ్ పాల్గొన్నారు.